పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి 50 పడకల స్థాయి నుంచి, వంద పడకల స్థాయి పెంపుకు సంబంధించి కొత్త భవనంలో అవసరమైన సౌకర్యాలు, వివిధ విభాగాల ఏర్పాటు అంశాలపై ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో పాలకొల్లు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు చర్చించారు. అందుకు అనుగుణంగా పలు సూచనలు చేశారు. 100 పడకల ఆసుపత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు