నడకతో షుగర్ ను నియంత్రించవచ్చని బలుసులమ్మ ఆలయ కమిటీ సభ్యుడు వట్టిప్రోలు రాము అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం పట్టణం కడగట్లలో జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఉచిత రక్త షుగర్ పరీక్ష శిబిరం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం కొంతసేపు నడక అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం 97 మందికి పరీక్షలు నిర్వహించారు. వంగపండు రామ్మోహన్రావు, చిన్నం జగదీష్, హరిబాబు పాల్గొన్నారు.