కూటమి అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు: మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం తణుకు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు పట్టణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేసి దోమల సమస్యను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కృషి చేస్తామని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్