పెనుమంట్ర మండలం నెగ్గిపూడి పంచాయతీ పరిధిలోని వనంపల్లి గ్రామంలో శుక్రవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజీషిఎన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ చావీర్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలువురు పెషేంట్లకు, గురుకుల హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఏ రామకృష్ణ, ఎంఎల్ హెచ్ పీ సంధ్య, ఏఎన్ ఎం మాధవి, పైలట్, ఆశ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.