ప. గో. జిల్లా భీమవరంలో "పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి ఎన్. డి. ఏ కూటమి సదస్సు" శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ, పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు.