అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ గా భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామానికి చెందిన నాగిడి తాతాజీ పేరును మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా భీమవరం నియోజవర్గం నుండి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్‌కు తాతాజీ పేరును ప్రకటించారు. తాతాజీ గతంలో రెండుసార్లు గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు.