శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో "నేషనల్ సైన్స్ డే "వేడుకలు సందర్భముగా శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమవరం మున్సిపల్ కమీషనర్ శివ రామ కృష్ణ మరియు ఉంగుటూరు మండల ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత విచ్చేసారు. ముందుగా విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ ను వీక్షించి అనంతరం సర్ సి వీ రామన్ చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతిప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం సైన్స్ ప్రాజెక్ట్స్ లో గెలుపొందిన విద్యార్హులకు బహుమతుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుమారు 80 సైన్స్ ప్రాజెక్ట్స్ విద్యార్థులు ప్రెసెంట్ చేసారని తెలియజేసారు. ప్రిన్సిపాల్ ఏ అనురాధ మాట్లాడుతూ ఇటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థులలో నైపుణ్యం మెరుగుపడుతుందని తెలియజేసారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి మావుళ్లు, ఏ ఓ సురేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ప్రోగ్రాంని జయప్రదం చేసారు.