
భీమవరం: ఈ నెల 21న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
ఈ నెల 21న భీమవరం నరసయ్య ఆగ్రహారంలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ భీమవరం ఇన్చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు ఆరు జిల్లాల ఇన్చార్జ్లు హాజరవుతారని తెలిపారు.