చింతలపూడి: చెరువులో పడి వ్యక్తి మృతి

71చూసినవారు
చింతలపూడి: చెరువులో పడి వ్యక్తి మృతి
చింతలపూడి మండలం వెంకటాపురంలో సోమవారం ప్రమాదవశాత్తు చెరువులో పడి రాజు (52) అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాలికి బంధం ఉన్న పాడి గేదె చెరువులోకి దిగింది. దీంతో మునిగిపోతున్న గేదెను కాపాడేందుకు చెరువులోకి దిగి, బందాన్ని తొలగించాడు. అప్పటికే మృతి చెందిన గేదె మీద పడటంతో రాజు చెరువులో మునిగి చనిపోయినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్