ఇటీవల వచ్చిన వరదలకు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో 153 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రెవిన్యూ డివిజన్ అధికారి అద్దయ్య శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డివిజన్ పరిధిలోని జీలుగుమిల్లి, పోలవరం, ద్వారకాతిరుమల మండలాల్లో ఈ నష్టం వాటిల్లగా 55 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. వీటికి సంబంధించి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలియజేశారు.