రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో నిరుపేదలకు తక్కువ ధరకు కందిపప్పు అందించాలని నిర్ణయిస్తే, చాట్రాయి మండలంలో మాత్రం కందిపప్పు అందించని పరిస్థితి నెలకొంది. లింగపాలెం, చింతలపూడి వంటి మండలాలలో కందిపప్పు సరఫరా అయితే, చాట్రాయికి మాత్రం రాలేదు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలు సంతోషపడుతున్న సమయంలో, రేషన్ షాప్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. అధికారుల పర్యవేక్షణలో లోపమా లేదా నిర్లక్ష్యం ఉందా?