పెదపాడులో చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్న వాహనం సీజ్

83చూసినవారు
పెదపాడులో చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్న వాహనం సీజ్
పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని ఎస్సై సతీశ్ శనివారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. పక్కా సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించి వాహనాన్ని సీజ్ చేశామని చెప్పారు. అదేవిధంగా వాహన డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్