పెదవేగి మండలం జానంపేటలో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదివారం పాల్గొన్నారు. జీవితంలో ఒక వ్యక్తి అన్ని రంగాల్లో ఎదగడంతోపాటు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తన సేవలు అందించడమే జీవిత పరమార్ధమని, అనుకున్న లక్ష్యాన్ని చేరటంలో ఎలాగైనా పోరాడి సాధించాలనే ఉదాహరణకు ఎమ్మెల్యే చింతమనేని ఒక నిదర్శనమని పలువురు వక్తలు పేర్కొన్నారు.