అధిక ధరలు, నిరుద్యోగం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 8నుంచి 15 వరకు సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ‘ప్రజాహోరు’ పేరుతో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లింగరాజు పిలుపునిచ్చారు. బుధవారం పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18వ తేదిన మండల కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని కోరారు.