ఏలూరులోని దయానంద సరస్వతి హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్ భర్త శశికుమార్, దానికి కారణమైన హాస్టల్ వార్డెన్ ను కఠినంగా శిక్షించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏలూరులో కలెక్టర్ సెల్వికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి జయప్రకాష్, చింతలపూడి ఇంచార్జి కంభం విజయ్ రాజు తదితరులు పాల్గొన్నారు.