ఉమ్మడి ప. గో. జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం జరిగింది. ఏలూరు జిల్లా కార్యాలయంలో ఉమ్మడి ప. గో. జిల్లా రిజిస్ట్రార్లు కె. శ్రీనివాసరావు, లంకా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. మొత్తం 42 మంది సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించగా. 24 మంది జూనియర్ అసిస్టెంట్లు, 14 మంది సబార్డినేట్లు, నలుగురుని బదిలీ చేసినట్లు తెలియజేశారు.