ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను ఆదివారం అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లాలో అత్యధిక వర్షపాతం చింతలపూడి మండలంలో 42. 2 మిల్లీమీటర్లు నమోదు కాగా. అత్యల్ప వర్షపాతం జీలుగుమిల్లి మండలంలో 0. 2 మిల్లీమీటర్లు గా నమోదయింది. అలాగే జిల్లా మొత్తం వర్షపాతం 123. 2 మిల్లీమీటర్లు కాగా సగటు వర్షపాతం 4. 4 మిల్లీమీటర్లుగా ఉంది.