ఏలూరు మండలం పోణంగికి చెందిన అఖిల తన భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలో తండ్రి మందలించడంతో శుక్రవారం 3 నెలల బిడ్డతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ వెంటనే స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక గంటలోనే ఆమె విజయవాడలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అక్కడ నుంచి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.