ఏలూరు జిల్లా కలెక్టరు వెట్రిసెల్వీ అధ్యక్షతన రాజకీకయ పక్షాల సమావేశంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో డిసెంబరు 5న జరగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుని ఉప ఎన్నికకు సంబందించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ ఎన్నికకు సంబందించి ఏలూరు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వాటిలో ఇప్పటి వరకు నమోదయైన 2659 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.