జగనన్న పోషకాహార కిట్లు అందచేత

565చూసినవారు
జగనన్న పోషకాహార కిట్లు అందచేత
దేవరపల్లి మండలం, యర్నగూడెం గ్రామపంచాయితీ పరిధిలోని సూర్యనారాయణపురం గ్రామంలో మినీ అంగన్వాడీ కేంద్రంవద్ద చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమం జరిగింది. తదుపరి వారికి జగనన్న పౌష్టిక ఆహార కిట్లు అందించే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బొంతా భరత్ బాబు తల్లులకు పౌష్టిక ఆహార కిట్లను అందించారు. భరత్ బాబు మాట్లాడుతూ చిరు ధాన్యాలతో కూడిన పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాన్ని చిన్నారులకు అందించటం ద్వారా ప్రతి బిడ్డా ఆరోగ్యకరంగా ఉండేందుకు దోహదం చేస్తుందని ఆదిశగా పోషకాహార కిట్లను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దాసరి ముత్యం సచివాయ కార్యదర్శి రవికుమార్ రాజశేఖర్ నారాయణ మహిళా పోలీస్ అనూష తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్