ఎన్ఎల్ఎస్ ఏరియాలో పండించిన పొగాగుకు డిమాండ్

251చూసినవారు
ఎన్ఎల్ఎస్ ఏరియాలో పండించిన పొగాగుకు డిమాండ్
నాణ్యమైన పొగాకును పండించడం ద్వారా రైతులు ఆశాజనకమైన ధరను పొందవచ్చునని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవరపల్లి టొబాకో బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ ఏడాది రెండు వేల హెక్టార్లలో అదనంగా పొగాకు పంట సాగు పెరిగిందని ఆయన తెలిపారు. రైతులకు దిగుబడి ఇచ్చే వంగడాల కోసం రాజమహేంద్రవరం సి టి ఆర్ ఐ లో వివిధ ట్రేడర్లలను కలుపుకొని ఐదు ప్రాజెక్టులపై చర్చించి, దిగుబడులు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం జరుగిందని తెలిపారు.

నేల స్వభావాన్ని బట్టి రైతులు ఎరువులు వాడే విధానo పై శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించడం కొరకు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్ ఎల్ యస్ ఏరియాలో పండించే పొగాకు పంటకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. సిబ్బంది కొరతపై విలేకరులు ప్రశ్నించగా సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు పంపినట్టు ఆయన తెలిపారు. రైతులు బోర్డు సూచనలు సలహాలు పాటించి పొగాకులో రసాయన అవశేషాలు లేకుండా పండించడం వల్ల నాణ్యతతో పాటు డిమాండ్ కూడా పెరిగిందని అన్నారు. గత ఏడాది 44. 1 మిలియన్లు కాగా సరాసరి 191. 74 రూపాయల ధర పలికినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కరుటూరి శ్రీనివాసరావు, కాంట్రు సత్యనారాయణ, కె. శ్రీనివాసరావు, యాగంటి వెంకటేశ్వరరావు తదితర రైతులు మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది వర్జీనియా సాగులో సాగు వ్యయం పెరిగిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎమ్ జి. యల్. కె. ప్రసాద్, బోర్డు అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్