YS జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేసేందుకు కుట్ర: YCP

64చూసినవారు
YS జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేసేందుకు కుట్ర: YCP
ఏపీలో వైఎస్ జగన్‌కు షర్మిల రాసిన లేఖ టీడీపీ బయటపెట్టడంతో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో వైసీపీ టీడీపీపై మండిపడుతోంది. టీడీపీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒకవైపే చూపించి ప్రజల్ని పక్కదోవ పట్టించే ఎత్తుగడలు వేస్తోందని వైసీపీ ట్వీట్ చేసింది. వైఎస్ జగన్‌ని రాజకీయాల్లో లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ఫైర్ అయింది. ఈ క్రమంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలంటూ జగన్ షర్మిలకు రాసిన లేఖను వైసీపీ విడుదల చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్