సాధారణంగా రోడ్ల పక్కన బండ్ల మీద అమ్మేవారు స్నాక్స్ గానీ.. ఇతర ఆహారాలు న్యూస్ పేపర్లలో కట్టి ఇస్తుంటారు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పేపర్లలో బ్యాక్టీరియాలు, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండటంతో ఆహార పదార్థాలు విషంగా మారి ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో తిను బండారాలను ప్యాక్ చేయటానికి న్యూస్ పేపర్లు ఎట్టి పరిస్థితుల్లోను వినియోగించరాదని FSSAI హెచ్చరించింది.