దేవరపల్లి మండలంలోని చిన్నయిగూడెం దేవరపల్లి దుద్దుకూరు గౌరపట్నం స్టాక్ నగరం కృష్ణంపాలెం యాదవోలు బంధపురం గ్రామాలలో బాబుజగజ్జివన్ 114వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు తలారి వెంకటావు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా వెంకటారావు మాట్లాడుతూ బాబు జగజ్జివన్ ఎన్నో పదవులలో కొనసాగారు. ఆయన మచ్చలేని నాయకులు బాబు జగజ్జివాన్ కార్మిక శాఖ లో ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెట్టి దళిత జాతి ఉద్దారణ కోసం చట్టసభలలో మార్పు చేసారని తెలిపారు. ఆయనను ఆదర్శగా తీసుకుని యువత ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపిపి కె వి కె దుర్గారావు జెడ్పిటిసి పొట్టి స్వర్ణలత, ఎంపిటిసి పల్లికొండ రామలక్ష్మి, వార్డు మెంబర్ చిడిపి వెంకటేశ్వరి, మాధవరపు, వెంకటేశ్వరావు, సర్పంచ్ కడిమి వీరాకుమారి, కె రాజు కొడమంచిలి శ్రీను సిర్రా కృపారావు, ప్రత్తిపాటి సుబ్బారావు, గాలింకి పెదసముద్రయ్య చిడిపి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.