క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని, నల్లజర్ల సంఘంలో రాత్రి 8గంఃలకు పలు కార్యక్రమాలు ద్వారా యేసుక్రీస్తు వారికి మహిమకరంగా,వచ్చిన పురజనులకు ఆశీర్వాద కరంగా చిన్న పిల్లల వాక్యపఠనం,తదనంతరం నాటికలు ప్రదర్శించారు.ముఖ్య అథితిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ సంచార జాతుల లీగల్ సెల్ కన్వీనర్, శివ మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు పాపులైన వారిని రక్షించి, పరలోకరాజ్యం చేర్చడానికి ఈలోకంలో పుట్టారన్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడుగా అంగీకరించి,ఆశీర్వదించబడాలని మనవి చేసారు. యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమను,ఆయన చూపిన మార్గాని ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలని కోరారు.