మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వెంచేసివున్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కళకళలాడింది. భక్తుల అమ్మవారి దర్శనం ప్రత్యేక పూజలు చేశారు. కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఎం జగదీష్ కుమార్, చైర్మన్ కడలి మాణిక్యాల రావుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది పాలకవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.