పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం ఎలమంచిలి గ్రామంలో అక్రమ భూతవాకాలు ఆపాలి కుల వివక్షవ్యతిరేక పోరాట సంఘం (కెవిపిస్) జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో 60 సంవత్సరాల క్రితం ఎస్సీ, బీసీ బలహీనవర్గాలకు చెందిన 300 కుటుంబాల పేదలకు 60 ఎకరాల భూమిని పోరాడి సాధించుకున్నారు ఆన్నారు. ఆ భూములను అనుకుని మరో 10 ఎకరాల పెరుగులంక ఏర్పడింది. అవి కూడా వీరాధినంలోనే ఉన్నాయి. ఆ భూముల మీద 600 కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఆ భూముల్లో జగనన్న కాలనీలా పూడిక పేరుతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఇదేమి అన్యాయం మనీ ప్రశ్నించిన వారిని పోలీసులతో చితకబాదించి మహిళలను విడిచివేసి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే అక్రమ కేసులు ఎత్తి వేయాలని వేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమ భూతవాకాలను ఆపి దళితులకు బీసీలకు రక్షణ కల్పించాలని అన్నారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చించినాడ దళితులు బీసీలు కు మద్దతుగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.