పాలకొల్లు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండి ఈ పూజలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ జరిగింది. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను నిర్వాహకులు పర్యవేక్షించారు.