బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి గ్రామంలోని సమస్యలకు సంబంధించి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం గ్రామంలో లో వోల్టేజ్ సమస్య ఉందని గ్రామస్తులు తెలపడంతో వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.