కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు చూపిస్తున్న మీడియా మిత్రులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం జీలుగుమిల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మీడియాలో పని చేసే నిజమైన జర్నలిస్టులకు తప్పక గుర్తింపు ఉంటుందని, వారికి ఇంటి స్థలాలు ఇప్పించడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.