Oct 22, 2024, 06:10 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఆదిలాబాద్: మంచినీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన
Oct 22, 2024, 06:10 IST
తమ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని కె. ఆర్. కే కాలనీవాసులు ఆందోళనకు దిగారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైటాయించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నీటి సమస్య ఏర్పడిందని, కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.