ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందిన మారిశెట్టి మణికంఠ, పామర్తి నాగేంద్ర, కాసగాని కృష్ణ, బి. వీర్రాజు కుటుంబాలను సోమవారం రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆమె వెంట నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు, కూటమి నాయకులు ఉన్నారు.