కార్మిక,సామాజిక వర్గ మార్పునకు కృషి చేస్తుంది:ఏఐటీయూసీ

77చూసినవారు
కార్మిక,సామాజిక వర్గ మార్పునకు కృషి చేస్తుంది:ఏఐటీయూసీ
కార్మిక వర్గ చైతన్యానికి, సామాజిక వర్గ మార్పునకు ఏఐటీయూసీ కృషి చేస్తుందని ఆ సంఘ ఏరియా సంయుక్త కార్యదర్శి కే. లక్ష్మణ్ అన్నారు. గురువారం పెంటపాడులో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం 4 కోడ్ లుగా విభజించి కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందన్నారు. కార్మిక లోకం పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్