దాతల సేవలు వెలకట్టలేనివి

78చూసినవారు
దాతల సేవలు వెలకట్టలేనివి
విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ తణుకు నియోజకవర్గం నుండి వివిధ వ్యాపారస్తులు, ప్రజలు, స్వచ్చంద సంస్థలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి తమవంతుగా రూ. 7 లక్షల 116 రూపాయలు సహాయాన్ని చెక్ ల రూపంలో ఈరోజు తణుకు క్యాంపు కార్యాలయం లో అందించారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్