మండపాక పైడిపర్రు గ్రామాలలో మంత్రి కారుమూరి ఎన్నికల ప్రచారం

73చూసినవారు
మండపాక పైడిపర్రు గ్రామాలలో మంత్రి కారుమూరి ఎన్నికల ప్రచారం
తణుకు మండలం మండపాక,పైడిపర్రు గ్రామాలలో సోమవారం మంత్రి కారుమూరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగనన్న కాలనీకి అవసరమైన రోడ్లు మరియు డ్రైనేజీలను తిరిగి మేమే నిర్మిస్తామని, ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమా బాలను ,ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు , సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి విజయమూర్తి , ఏఎంసీ మాజీ చైర్మన్ జానకి తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :