ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు?

64చూసినవారు
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు?
ఏపీ నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమలరావు సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అంజనా సిన్హా, సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ సైతం డీజీపీ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురూ కాకుంటే హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్