పాలకోడేరు మండలం తాహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. ఇటీవల వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని తనిఖీ సందర్భంలో ఉద్యోగులందరిని వివిధ అంశాలపై ప్రశ్నించి పలు ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా మండలంలో చేపట్టిన సర్వేలకు సంబంధించిన రికార్డులను, పీజీఆర్ఎస్ దరఖాస్తులను, పన్నులు వసూలు రిజిస్టర్లు, వివిధ అనుమతులు సంబంధించిన ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.