పశ్చిమగోదావరి జిల్లా ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణం, తరగతి గదులను మంత్రి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణంరాజు, కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.