అభివృద్ధిపై సమీక్షించిన అధికారులు

82చూసినవారు
అభివృద్ధిపై సమీక్షించిన అధికారులు
ఉంగుటూరు మండలంలో అభివృద్ధిపై బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గంజి రాజ్ మనోజ్, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనం, శిధిలావస్థలో ఉన్న భవనాలు మరమ్మతుల గురించి చర్చించడం జరిగింది. ఉపాధి కార్యాలయాన్ని మరో చోటకు, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని మండల పరిషత్ కార్యాలయానికి దగ్గరకు ఏర్పాటు చేసే విషయంపై ఎంపీడీవో, ఎంపీపీ సమీక్షించారు.

సంబంధిత పోస్ట్