ఉంగుటూరు మండలంలో మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటించారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు, గొర్రెలకు వాక్సిన్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విన్నూత్నరీతిలో ఉద్యానవన పంటల సాగు అభినందనీయమన్నారు. అలాగే గొర్రెల, మేకల వంటి పశు వైద్య సేవలకు 1962 టోల్ ఫ్రీ నెంబర్ పై విస్తృత అవగాహన కలిగించాలన్నారు.