బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తికి జైలు శిక్ష
పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు పట్టణానికి చెందిన 12 ఏళ్ల బాలికపై మాదివాడకు చెందిన మద్దా సుందర్ సింగ్ 2017లో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ముద్దాయికి న్యాయమూర్తి సోమశేఖర్ శుక్రవారం ఆరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ప్రస్తుత ఎస్సై నాగరాజు తెలిపారు.