భారత్, రష్యా మధ్య స్నేహబంధం శిఖరం కంటే ఎత్తైనదని, సముద్రం కన్నా లోతైనదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మూడు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన రాజ్‌నాథ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రష్యా రక్షణశాఖ మంత్రి ఆండ్రీ బెలోవ్‌సోవ్ పాల్గొన్నారు. ఇరుదేశాల రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.