బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై 88 మతపర హింసాత్మక ఘటనలు జరిగినట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది.
ఆయా కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్లు యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ తెలిపారు. ఇటీవలి కాలంలో మరిన్ని ఘటనలు, అరెస్టులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.