మీడియా ప్రతినిధులపై దాడికి దిగిన నటుడు మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ శివారు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయ్యాలని డిమాండ్ చేశారు. పోలీసులు తక్షణమే మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.