ఆచంట: అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
ఆచంట మండలం పెదమల్లం శివారు చిర్రావారిపేటలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో లంకా ధనరాజు అనే వ్యక్తికి చెందిన ఇల్లు కాలిపోవడంతో సుమారు నాలుగు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ పరిస్థితి చేయి జారిపోయింది.