ప.గో జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం శివారు పంపనవారిపాలెం పెట్రోల్ బంకు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ్బల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందాడు. వెంకటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై పెనుమంట్ర వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.