కామవరపుకోట: వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
ఏలూరు జిల్లా కామవరపుకోటలో ఒంటరి వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రాత్రి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో మంగమ్మ అనే వృద్ధురాలి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ఆసుపత్రికి చేరుకుని వివరాలను సేకరించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.