నేరాల వెనకున్న పెద్దతిమింగలాలనూ వదలం: సుజాత

84చూసినవారు
నేరాల వెనకున్న పెద్దతిమింగలాలనూ వదలం: సుజాత
వైసీపీ పాలనలో మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ ముఠాని వదిలిపెట్టేది లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత హెచ్చరించారు. దీని వెనకున్న పెద్ద తిమింగలాలపైనా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ ఆగడాలు ఇకపై సాగవన్నారు. ‘‘ప్యాలెస్‌లో కూర్చున్న పెద్ద తిమింగలాలను వదిలిపెట్టేది లేదు. వైసీపీ పాలనలో మహిళలపై 2,04,414 నేరాలు జరిగాయి’’ అని ఆమె స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్