మదనపల్లె ఘటన ఎలా జరిగిందో దేవుడికే ఎరుక అని మాజీ సీఎం జగన్ అన్నారు. 'దానికి ఎందుకింత హడావుడి. ఎవరో చేశారని.. మిథున్ రెడ్డి చేయించాడని మీడియాలో కథనాలు చిత్రించారు. సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో ఫైళ్లు కాలిపోతే ఏమవుతుంది? కింద ఆర్డీవో, పైన కలెక్టర్ ఆఫీస్‌లో ఉంటాయి కదా? ఆన్‌లైన్లో ఒక్క బటన్ నొక్కితే సమాచారం అంతా వస్తుంది. దానికి ఎందుకింత రాద్ధాంతం. కేవలం ఆ రోజు నేను వినుకొండ వెళ్లినందుకే' అని ఆరోపించారు.