సింగపూర్ లో షర్మిల ఏం చేస్తున్నారు?

71చూసినవారు
సింగపూర్ లో షర్మిల ఏం చేస్తున్నారు?
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఏపీలో కనిపించని పరిస్థితి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వేళ.. బయట మాత్రం కనిపించని పరిస్థితి. దీనిపై ఆరా తీసినప్పుడు ఆమె కొద్ది రోజులుగా సింగపూర్ లో ఉంటున్న కొత్త విషయం వెలుగు చూసింది. అయితే.. ఈ పర్యటన మొత్తం పూర్తిగా కుటుంబ వ్యవహారంగా చెబుతున్నారు. ఎందుకంటే.. షర్మిల కుమార్తె అంజలిరెడ్డి కాలేజీ ఆడ్మిషన్ కోసం ఆ దేశానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్